YSRCP Plenary: ‘బస్సు పెట్టాం.. అల్పాహారాలు ఏర్పాటు చేశాం. వైకాపా ప్లీనరీకి ప్రతి గ్రామం నుంచి సుమారు 20 మందికి తగ్గకుండా రావాలి’ అని వాలంటీర్లే ఆహ్వానిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వైకాపా ప్లీనరీ కొవ్వూరులో ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో చాగల్లు సచివాలయ వాలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాల వారికి వాట్సప్‌లో సందేశాలు పంపారు.
'బస్సు పెట్టాం.. టిఫిన్లున్నాయి.. రావాలి'.. వైకాపా ప్లీనరీకి వాలంటీర్ల ఆహ్వానం - వైకాపా ప్లీనరీకి వాలంటీర్ల ఆహ్వానం వార్తలు
YSRCP Plenary: తూర్పుగోదావరి జిల్లా వైకాపా ప్లీనరీ కొవ్వూరులో ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్లీనరీకి ప్రతి గ్రామం నుంచి సుమారు 20 మందికి తగ్గకుండా రావాలి అని వాలంటీర్లే ఆహ్వానిస్తున్నారు. బస్సు పెట్టాం.. అల్పాహారాలు ఏర్పాటు చేశామని చెబుతున్నారు.
వైకాపా ప్లీనరీకి వాలంటీర్ల ఆహ్వానం
సమావేశానికి సొసైటీ ఛైర్మన్లు, పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, నాయకులు వస్తారని, మన ప్రాంతానికి సంబంధించిన వాళ్లు తప్పక రావాలని, వచ్చేముందు తమకు తప్పనిసరిగా చెప్పాలని అందులో పేర్కొన్నారు.
ఇవీ చూడండి: