విజయవాడ నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్గా 58వ డివిజన్ కార్పొరేటర్ అవుతు శైలజరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియను జిల్లా కలెక్టర్ జె. నివాస్ నిర్వహించారు. 46 మంది కార్పొరేటర్లు ప్రత్యేక సమావేశానికి హాజరు అయ్యారు. శైలజ పేరును 33వ డివిజన్ కార్పొరేటర్ వి.ఎన్.డి. ఎస్.ఎస్ మూర్తి ప్రతిపాదించగా, 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి బలపరిచారు. మిగిలిన సభ్యుల నుంచి వేరే ప్రతిపాదన లేనందున, సభ్యుల ఆమోదంతో శైలజ వీఎంసీ రెండో డిప్యూటీ మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. సమావేశానికి హాజరైన దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో పాటు , ఎమ్మెల్సీ యండి.కరిమున్నిసా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వీఎంసీ కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఇతర కార్పొరేటర్లు శైలజని అభినందించారు.
విజయవాడ రెండో డిప్యూటీ మేయర్గా శైలజారెడ్డి ఎన్నిక - విజయవాడ వార్తలు
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియను జిల్లా కలెక్టర్ జె. నివాస్ నిర్వహించారు. 46 మంది కార్పొరేటర్లు ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. విజయవాడ రెండో డిప్యూటీ మేయర్గా 58వ డివిజన్ కార్పొరేటర్ శైలజారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
vmc deputy mayar elections