ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో.. పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు చేసిన అధికారులు - విజయవాడలో మున్సిపల్ కార్మికులపై కథనం

విజయవాడలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వీఎంసీ, ఆయుష్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సమస్యలు ఉన్నవారికి కంటైన్మెంట్ జోన్ లలో కాకుండా మామూలు ప్రాంతాల్లో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని నగర పాలక కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ అన్నారు.

పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించిన వీఎంసీ
పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించిన వీఎంసీ

By

Published : Jun 15, 2020, 6:29 PM IST

విజయవాడ నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులకు నగరపాలక సంస్థ, ఆయూష్ ఆసుపత్రిలో సంయుక్తంగా వైద్య శిబిరం నిర్వహించారు. నగరంలో సుమారు 3 వేలపై చిలుకు మంది పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని నగర పాలక కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ అన్నారు. కోవిడ్ నివారణకై పారిశుద్ధ్య కార్మికులు ముందు వరసలో ఉండి పని చేస్తున్నారని కొనియాడారు.

ఇప్పటికే నగరంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ముందుకు వచ్చాయని నగర పాలక కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. ఈ శిబిరం వారం పాటు నిర్వహిస్తామన్నారు. కార్మికుల వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను ఆన్​లైన్​లో పెట్టి... 6 నెలల తర్వాత తిరిగి వారికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సమస్యలు ఉన్నవారికి కంటైన్మెంట్ జోన్ లలో కాకుండా మామూలు ప్రాంతాల్లో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details