సమూహాలుగా కాకుండా సామాజిక దూరం పాటించాలనే నిబంధన కచ్చితంగా అమలుచేసేందుకు కృష్ణా జిల్లా అంతటా రైతు బజార్లలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కువ జనసాంద్రత, రద్దీ ఉండే విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని రైతుబజార్లలో వినియోగదారులు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతించిన సమయంలో భారీగా జనం గూమిగూడుతుండడం, కనీస సామాజిక దూరం పాటించకపోవడం వంటి అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మనిషికి మనిషికి మధ్య ఒక మీటరు(మూడు అడుగుల) దూరం ఉండేలా ప్రత్యేకంగా నేలపై మార్కింగ్ చేశారు. ప్రస్తుతం ఉన్న రైతుబజార్లకు అదనంగా మరికొన్ని రైతుబజార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సంచార రైతుబజార్లతోపాటు, నేరుగా షాపింగ్‌మాల్స్ నుంచి వినియోగదారులకు సరకులు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వినియోగదారులకు నిత్యావసరాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వీఎంసీ చీఫ్ ఇంజనీరు మరియన్న ఈటీవీ భారత్‌కు తెలిపారు.
రైతు బజార్లలో సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ - సోషన్ డిస్టెన్స్‌పై వీఎంసీ చీఫ్ ఇంజినీర్ ఇంటర్య్వూ
లాక్‌డౌన్‌తో నిత్యావసరాల కొనుగోలుకు ప్రజలు పెద్దఎత్తున మార్కెట్లకు వస్తున్నారు. సమూహాలుగా ఒక్కచోట చేరటం వల్ల కరోనా వ్యాప్తి ప్రమాదం ఉందని అధికారులు గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రైతు బజార్ల వికేంద్రీకరణ, మార్కెట్ల పెంపు, హోండెలివరీ ఏర్పాట్లు చేశారు. ఖాళీ ప్రదేశాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మూడు అడుగుల సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
వీఎంసీ చీఫ్ ఇంజినీర్ మరియన్న