తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజే(Chief Justice)లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సిఫార్సులను పంపింది. ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టుసీజేగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మను నియమించాలని సూచించింది.
Supreme Court: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు.. కొలీజియం సిఫార్సు - justice satishchandra sharma may new CJ of Telangana cj
13:56 September 17
నూతన సీజేల నియామకానికి సిఫార్సు
ఏపీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఏకే గోస్వామిని ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు బదిలీ చేసి.. ఆయన స్థానంలో ఛత్తీస్‌గఢ్ సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను నియమించాలని కొలీజియం సూచించింది.
తెలంగాణ హైకోర్టు సీజేగా పనిచేసిన జస్టిస్ హిమా కోహ్లీ స్థానంలో.. తాత్కాలిక సీజేగా జస్టిస్ ఎం.ఎస్ రామచంద్రరావు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక సీజే ఉన్న కారణంగా.. పూర్తిస్థాయి సీజేగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మను నియమించేందుకు కొలీజియం సిఫార్సు చేసింది.
ఇదీ చదవండి:
GRMB meeting: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం ప్రారంభం
TAGGED:
new cj to telangana