పదో తరగతి పరీక్షలు ఫలితాల వెల్లడికి ఫార్ములా రూపకల్పన కోసం నియమించిన హైపవర్ కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. కొవిడ్ కారణంగా పరీక్షలు రద్దు కావటంతో ఫలితాల వెల్లడికి అనువైన విధానంపై హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 2020, 2021 పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల వెల్లడికి హైపవర్ కమిటీ ఫార్ములాను రూపొందించింది. 2019-2020 విద్యా సంవత్సరానికి గ్రేడ్లు ప్రకటించేందుకు నిర్ణయించారు. ఆ ఏడాదిలో పాస్ సర్టిఫికెట్లు ఇచ్చిన వారందరికీ గ్రేడ్ పాయింట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
10th Results: పాస్ సర్టిఫికెట్లు ఇచ్చిన వారందరికీ గ్రేడ్ పాయింట్లు - HighPower Committe Recomondations
14:20 August 02
పాస్ సర్టిఫికెట్లు ఇచ్చిన వారందరికీ గ్రేడ్ పాయింట్లు ఇవ్వాలని నిర్ణయం
అంతర్గతంగా 50 మార్కుల చొప్పున నిర్వహించిన 3 ఫార్మెటివ్ అసెస్మెంట్ల ఆధారంగా ఈ గ్రేడ్లు ప్రకటించాలని స్పష్టం చేశారు. 2018, 2019 సంవత్సరాల్లో ఫెయిల్ అయ్యి 2020లో పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు గతంలోని వారి సామర్థ్యం ఆధారంగా 20 మార్కులకు లెక్కించి వంద మార్కులకు దాన్ని పరిగణించాలని సూచించారు. 2021 విద్యా సంవత్సరంలోని విద్యార్థులందరికీ అంతర్గత అసెస్మెంట్ మార్కులను 30 వెయిటేజీగా మరో 70 శాతం వెయిటేజిని స్లిప్ టెస్టులకు పరిగణించాలని హైపవర్ కమిటీ సిఫార్సు చేసింది. వివిధ కారణాల రీత్యా అంతర్గత అసెస్మెంట్ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు పాస్ గ్రేడ్ ఇవ్వాలని సిఫార్సుల్లో పేర్కొంది. వొకేషనల్ విద్యార్థులకు ఎస్ఎస్సీ పరీక్షల్లో వచ్చిన గ్రేడ్ల ఆధారంగా ఫలితాలు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి
payyavula keshav: 'బయటపెట్టిన అంశాలు కొన్నే.. ఇంకా పెద్ద ఆర్థిక ఉల్లంఘనలు జరిగాయ్..'