రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. 24 గంటల్లో 7వేల 293 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం బాధితుల సంఖ్య 6లక్షల 68వేల 751కి చేరింది. కొవిడ్ కాటుకు ఇవాళ 57 మంది చనిపోయారు. మెుత్తం మృతుల సంఖ్య 5వేల 663 కు చేరుకుంది. కరోనా నుంచి 5లక్షల 97వేల 294 మంది కోలుకోగా.... 65వేల 794 యాక్టివ్ కేసులున్నాయి.
జిల్లాల వారీగా నమోదైన కేసులు
24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 75 వేల 990 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,011 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు 975, పశ్చిమగోదావరి 922, ప్రకాశం 620 కడప 537, అనంతపురం 513, నెల్లూరు 466, కృష్ణా 450, విశాఖ 450, విజయనగరం 444, గుంటూరు 393, శ్రీకాకుళం 306, కర్నూలు 206 మందికి పాజిటివ్ వచ్చింది.
జిల్లాల వారీగా మృతులు
ప్రకాశం జిల్లాలో 10, చిత్తూరు 8, కడపలో 8, కృష్ణా 6, విశాఖలో 5, తూర్పు గోదావరి జిల్లాలో 4, పశ్చిమగోదావరిలో 4, గుంటూరు 3, నెల్లూరు 3 అనంతపురం 2, శ్రీకాకుళం 2, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
ఇదీచదవండి
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు... పొంగుతున్న నదులు, వాగులు