ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పోలీసులు ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం బాధాకరం'

స్వర్ణ ప్యాలెస్​ ప్రమాద ఘటనలో పోలీసులు ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారని రమేష్​ ఆస్పత్రి బోర్డు డైరెక్టర్​ రాయపాటి శైలజ అన్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తేనే.. డాక్టర్​ రమేష్​ కొవిడ్​ సెంటర్లు ఏర్పాటు చేశారని ఆమె స్పష్టం చేశారు. న్యాయం తమ వైపే ఉందని.. త్వరలోనే ఇబ్బందులు అధిగమిస్తామని శైలజ అన్నారు. కేసుకు సంబంధించి విజయవాడ పోలీసులు ఆమెను ప్రశ్నించారు.

'పోలీసులు ఓ వర్గం వారిని లక్ష్యంగా చేయడం బాధ కలిగిస్తోంది'
'పోలీసులు ఓ వర్గం వారిని లక్ష్యంగా చేయడం బాధ కలిగిస్తోంది'

By

Published : Aug 18, 2020, 8:07 PM IST

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి ప్రభుత్వం.. పోలీసులు ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవటం ఆవేదన కలిగిస్తోందని రమేష్ ఆస్పత్రి బోర్డు డైరక్టర్ రాయపాటి శైలజ అన్నారు. ప్రమాదానికి సంబంధించి.. విజయవాడ పోలీసులు గుంటూరు రమేష్​ ఆస్పత్రికి వచ్చి ఆమెను విచారించారు. దాదాపు గంటపాటు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు.

న్యాయం మా వైపే ఉంది

ఈ కేసులో న్యాయం తమవైపే ఉందని.. త్వరలోనే ఇబ్బందులు అధిగమిస్తామని రాయపాటి శైలజ విశ్వాసం వ్యక్తం చేశారు. స్వర్ణ ప్యాలెస్​ ఘటన అనుకోకుండా జరిగిందన్న ఆమె.. తాను 8 నెలలుగా వైద్య వృత్తిలో లేనని చెప్పినట్లు తెలిపారు. ఎన్నో ఒత్తిళ్లు వస్తేనే.. డాక్టర్​ రమేష్​ కొవిడ్​ సెంటర్లు ఏర్పాటు చేశారని.. అందుకు ప్రభుత్వం సైతం అనుమతి ఇచ్చిందని ఆమె చెప్పారు. దేశంలో చాలా చోట్ల ప్రమాదాలు జరిగినా.. ఇంతలా వేధింపులు ఎక్కడా లేవని శైలజ వాపోయారు. డాక్టర్ రమేష్ 30 ఏళ్లుగా సంపాదించుకున్న పేరు, ప్రతిష్టల్ని దెబ్బతీసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. పైగా కులం పేరుతో దుష్ప్రచారం చేయటం బాధగా ఉందని... రమేష్ బాబుని రమేష్ చౌదరిగా ప్రచారం చేయటమే దీనికి నిదర్శనమని అన్నారు.

ఇదీ చూడండి..

ఫోన్​ ట్యాపింగ్​పై ఎందుకు విచారణ చేయకూడదు?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details