ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆలయాలపై దాడులకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ ర్యాలీ - విజయవాడ తాజా వార్తలు

హిందూ ఆలయాలపై దాడులను ఖండిస్తూ.. విజయవాడ మహానగర విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కాగాడాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి హిందూ ఆలయాలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.

vishwa hindu parishad rally about attacks on temples in vijayawada
ఆలయాలపై దాడులకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ ర్యాలీ

By

Published : Dec 30, 2020, 8:47 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాలపై దాడులను నిరసిస్తూ.. విజయవాడ మహానగర విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కాగాడాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. నగరంలోని సత్యనారాయణపురం వీహెచ్​పీ కార్యాలయం నుంచి బీఆర్ టీఎస్ రోడ్డు వరకు కొవ్వొత్తులు, కాగాడాలతో పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి హిందూ ఆలయాలను పరిరక్షించకపోతే తామే ఆ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును వెంటనే బర్తరఫ్ చేయాలని.. విహెచ్​పీ నేతలు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details