ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"వాలంటీర్లు సరిగ్గా పనిచేస్తే లీడర్లను చేస్తా"

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వలంటీర్ల వ్యవస్థ ప్రారంభమైంది. విజయవాడ ఎస్.ఎస్. కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి దీనికి శ్రీకారం చుట్టారు.

జగన్

By

Published : Aug 15, 2019, 12:52 PM IST

Updated : Aug 15, 2019, 2:48 PM IST

సీఎం జగన్ ప్రసంగం

ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం కల్పించేందుకే వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వలంటీర్ ద్వారానే ప్రతి పథకానికి లబ్దిదారులను ఎంపికచేస్తామని... నిజమైన అర్హులను గుర్తించే బాధ్యత వారిదేనని సీఎం స్పష్టం చేశారు. వలంటీర్ల వ్యవస్థకు విజయవాడలో శ్రీకారం చుట్టిన జగన్... అనంతరం వలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. 50 ఇళ్లకు సంబంధించి సమస్యలన్నీ వాలంటీర్లే పరిష్కరించాలని వివరించారు. గ్రామ సచివాలయానికి వాలంటీర్లు అనుసంధానం కావాలని... ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు సత్వరం పరిష్కరించాలిని చెప్పారు. ప్రతిఒక్కరూ సేవాభావంతో పనిచేసి మంచిపేరు తెచ్చుకోవాలిని సీఎం సలహా ఇచ్చారు. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశం పూర్తిచేయడమే తమ లక్ష్యమని జగన్ తెలిపారు. ఇప్పటికే 80 శాతం హామీలు అమలు చేశామని... వచ్చే ఏడాదిలో మిగిలిన 20 శాతం హామీలను నెరవేర్చనున్నట్లు పేర్కొన్నారు. "మీ కోసమే నేను వేచి చూస్తున్నా...మీరు వచ్చేదాకా ప్రతి పథకం ఆపాం" అని వలంటీర్లతో సీఎం అన్నారు. సెప్టెంబర్ 1న శ్రీకాకుళంలో ఇంటింటికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించారు. నెలకు ఒక జిల్లా చొప్పున రాష్ట్రమంతటా ప్రజలకు సన్నబియ్యం సరఫరా చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో ఇంటి స్థలం లేని పేదవాడు ఉండకూడదని జగన్ అన్నారు. వాలంటీర్లు సరిగ్గా పనిచేస్తే లీడర్లుగా తయారుచేస్తామని సీఎం ప్రకటించారు. అలాగే ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు 1902 అనే టోల్​ఫ్రీ నంబర్​ను తెస్తున్నామని సీఎం తెలిపారు. వలంటీర్లపై ఎలాంటి ఫిర్యాదు అందినా విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. తాను నమ్మిన గ్రామ వలంటీర్లు తప్పు చేశారు అనే మాట రానివ్వకూడదని ముఖ్యమంత్రి జగన్ కోరారు.

Last Updated : Aug 15, 2019, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details