PROBATION: ప్రోబెషన్ డిక్లేర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంపై గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ కార్యాలయంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్కు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకూ ఆందోళనలో ఉన్న తమకు భరోసా కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.
PROBATION: ప్రోబెషన్ డిక్లేర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. ఉద్యోగుల హర్షం - హర్షం వ్యక్తం చేస్తున్నగ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు
PROBATION: ప్రోబెషన్ డిక్లేర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంపై గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ఆందోళనలో ఉన్న తమకు భరోసా కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2022 జూలై 1 నుంచి ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ ఉత్తర్వులిచ్చిన గ్రామ వార్డు సచివాలయ శాఖ .. ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీసు రూల్స్ ప్రకారం ..కొత్త పే స్కేల్స్ అమలు చేయనున్నట్టు పేర్కొంది . జూన్ 30 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని డిపార్ట్మెంటల్ టెస్టులు పాసైన వారందరికీ ప్రోబెషన్ డిక్లేర్ చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది. గ్రామవార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వివిధ విభాగాలకు చెందిన కార్యదర్శులకు 22 వేల 460 రూపాయల పే స్కేలును నిర్ధారిస్తూ ఆదేశాలు జారీ చేశారు..
ఇవీ చదవండి:
TAGGED:
ap latest news