ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vikarabad Municipality news today : కలెక్టర్ మొక్కలు నాటమన్నారు.. వాళ్లు​ పీకేసి మూసీలో విసిరేశారు!

Vikarabad Municipality news today : అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తే.. ఎక్కడి సిబ్బందైనా పొరపాట్లు సరిదిద్దుకుంటారు. కానీ.. తెలంగాణలోని వికారాబాద్ పురపాలక సిబ్బంది మాత్రం.. దానికి భిన్నంగా వ్యవహరించారు. నర్సరీలోని మొక్కలను ఎందుకు నాటలేదని కలెక్టర్ ప్రశ్నిస్తే.. వాటిని ఏకంగా పీకేసి బయట పడేశారు.

కలెక్టర్​ తిట్టారని మొక్కలు పీకేశారు
కలెక్టర్​ తిట్టారని మొక్కలు పీకేశారు

By

Published : Nov 25, 2021, 3:54 PM IST

Vikarabad Municipality news today: తెలంగాణలోని వికారాబాద్ మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ నిఖిల.. మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించారు. ఆ సమయంలో అక్కడి అర్బన్ నర్సరీలో ఏపుగా పెరిగిన మొక్కలను చూశారు. మొక్కలు ఏపుగా పెరిగే వరకు ఏం చేస్తున్నారని.. వాటిని హరితహారంలో భాగంగా ఎందుకు నాటలేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కలు నాటాలని పురపాలక సిబ్బందిని ఆదేశించారు.

Vikarabad district collector Nikhila: కలెక్టర్ మొక్కలు నాటాలని చెబితే.. అక్కడి పురపాలక సిబ్బంది మాత్రం దీనికి భిన్నంగా చేశారు. నర్సరీలో ఏపుగా పెరిగిన మొక్కలన్నింటిని పీకేసి మూసీ నదిలో పడవేశారు. అక్కడి మట్టిని చదును చేశారు.

కోట్ల రూపాయలు వెచ్చించి హరితహారంలో భాగంగా కొనుగోలు చేసిన మొక్కలను నాటకుండా.. మూసీ నదిలో పడవేయడం పట్ల మండలకేంద్రంలోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాష్ట్రమంతా పచ్చదనం పరచాలని చెబుతుంటే.. వికారాబాద్ పురపాలక సిబ్బంది నిర్లక్ష్యం ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తోందని అంటున్నారు. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు.. పురపాలక పర్యావరణ అధికారి శ్రీనివాస్.. మొక్కలను తొలగించాలని ఆదేశించారని సిబ్బంది చెబుతున్నారు. ఆయన ఆదేశాల మేరకే మొక్కలు తొలగించి మూసీ నదిలో విసిరేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి :CBN: నాన్న తాగితేనే.. "అమ్మ ఒడి" ఇస్తామనడం దుర్మార్గం: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details