ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పార్టీకి టాస్క్ మాస్టర్స్ కావాలి...షో చేసే వాళ్లు కాదు : కేశినేని నాని - facebook posts

తెదేపా విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్వీట్టర్ వేదికగా మరొసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశానికి విషయం ఉన్నవాళ్లు కావాలి కాని...షో చేసే వాళ్లు కాదని అభిప్రాయపడ్డారు. పార్టీని గాడిని పెట్టే నిర్ణయాలు తీసుకోవాలని అధిష్ఠానానికి సూచనలు చేశారు.

పార్టీకి టాస్క్ మాష్టర్స్ కావాలి...షో చేసే వాళ్లు కాదు : కేశినాని నేని

By

Published : Jul 9, 2019, 8:10 AM IST

Updated : Jul 9, 2019, 9:37 AM IST



తెదేపా విజయవాడ ఎంపీ కేశినేని నాని మరొసారి వార్తల్లో నిలిచారు. గత కొద్ది కాలంగా సామాజిక మాధ్యమాల్లో తన అభిప్రాయలతో వాడివేడి చర్చలకు ఊతం ఇస్తున్న నాని...తాజాగా ట్వీట్టర్​లో సంచలన వ్యాఖ్యలు చేశారు. నాని పెట్టిన ఈ ట్వీట్​పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీకి టాస్క్ మాష్టర్స్ కావాలి...షో చేసే వాళ్లు కాదు : కేశినాని నేని


'తెలుగుదేశానికి ఇప్పుడు విషయం ఉన్నవాళ్లు కావాలి... షో చేసే వాళ్ళు కాదు'---కేశినేని నాని, విజయవాడ ఎంపీ

సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత సామాజిక మాధ్యమాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కేశినేని నాని..తాజా పెట్టిన ట్వీట్ ఈ కోవలోకే వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్లమెంటరీ నేతగా తనను ఎంపిక చేయకపోవడంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన నాని...పార్టీ మారుతారనే చర్చ బలంగానే నడిచింది. పార్టీ పెద్దల బుజ్జగింపులు, చంద్రబాబుతో చర్చ అనంతరం కొంత సంయమం పాటించిన నాని..మళ్లీ తన పోస్టింగ్​లతో చర్చకు తెరతీశారు. పార్టీకి టాస్క్ మాస్టర్స్ కావాలి కాని..షో మాస్టర్స్ కాదని అభిప్రాయపడ్డారు. పార్టీని గాడిని పెట్టే నిర్ణయాలు తీసుకోవాలని అధిష్ఠానానికి పరోక్షంగా సూచించారు.

ఇదీ చదవండి :పార్టీ మార్పుపై ప్రత్తిపాటి క్లారిటీ.. నిజం లేదని స్పష్టం

Last Updated : Jul 9, 2019, 9:37 AM IST

ABOUT THE AUTHOR

...view details