కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు హోమ్ ఐసోలేషన్ ఉన్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పెనమలూరులో గృహ నిర్భంధం నుంచి బయటకు వచ్చిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. విజయవాడలోని రైతు బజార్లలో నిబంధనలు ఏ విధంగా పాటిస్తున్నారో ప్రత్యక్షంగా సీపీ ద్వారకా తిరుమలరావు పరిశీలించారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తున్నారని తెలిపారు. నమోదైన 3 కరోనా పాజిటివ్ కేసులూ విదేశాల నుంచి వచ్చినవాళ్లేనని సీపీ వెల్లడించారు. అనవసరంగా రోడ్డుపైకి ప్రజలు రావద్దని .. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రజలు సహకరించాలని విజయవాడ సీపి ద్వారకా తిరుమలరావు కోరారు.
విజయవాడ రైతుబజార్లను పరిశీలించిన సీపీ తిరుమలరావు - విజయవాడ రైతుబజార్లు పరిశీలించిన సీపీ తిరుమల రావు
విజయవాడలో రైతుబజార్లు, కూరగాయల దుకాణాలను సీపీ ద్వారకా తిరుమలరావు పరిశీలించారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తున్నారని తెలిపారు. అనవసరంగా రోడ్డుపైకి రావద్దని ప్రజలకు సూచించారు.
విజయవాడ రైతుబజార్లు పరిశీలించిన సీపీ తిరుమల రావు
TAGGED:
latest news on carona