మూడు రాజధానుల ప్రకటన వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అభిప్రాయపడ్డారు. విజయవాడలోని ధర్నాచౌక్లో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న రిలే నిరాహార దీక్షలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రాంతీయ విభేదాలు పెరిగే అవకాశముందని వాకర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఇప్పటికే పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే మూడు రాజధానుల ప్రకటనను ఉపసంహరించుకోవాలని కోరారు.
'మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రానికి తీవ్ర నష్టం' - amaravathi protest in vijayawada
విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రిలే నిరసన దీక్షల్లో పాల్గొన్నారు. మూడు రాజధానుల ప్రకటన వల్ల ఇప్పటికే పెట్టుబడులు వెనక్కి మళ్లి... రాష్ట్రానికి నష్టం జరిగిందని వాపోయారు.
'మూడు రాజధానుల ప్రకటనతో...పెట్టుబడులు వెనక్కి'