ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విజయవాడ కార్పొరేషన్​పై మళ్లి తెదేపా జెండా ఎగురుతుంది'

వైకాపాకు ఓటు వెయ్యకపోతే పింఛన్లు తీసేస్తామంటూ వాలంటీర్లను ఇళ్లకు పంపుతున్నారని తెదేపా ఆరోపించింది. ఎన్నికల్లో గెలవకపోతే మంత్రుల పదవులు పోతాయని ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి స్వయంగా బెదిరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో తెదేపాయే గెలుస్తుందని, విజయవాడ కార్పొరేషన్​పై మళ్లి తెదేపా జెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కార్పోరేషన్ ఎన్నికల కసరత్తుపై తెదేపా సమావేశం
కార్పోరేషన్ ఎన్నికల కసరత్తుపై తెదేపా సమావేశం

By

Published : Mar 9, 2020, 8:52 PM IST

కార్పోరేషన్ ఎన్నికల కసరత్తుపై తెదేపా సమావేశం

స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు వైకాపా నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. ఎన్నికల్లో గెలవకపోతే మంత్రి పదవులు ఊడతాయంటూ స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో తెదేపాయే గెలుస్తుందని, విజయవాడ కార్పొరేషన్​పై మళ్లీ తెదేపా జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

సామాజిక సమీకరణాలతో మేయర్ అభ్యర్థి ఎంపిక ఉంటుందని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. మేయర్ అభ్యర్థిపై అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని తేల్చి చెప్పారు. విజయవాడ కేశినేని భవన్​లో స్థానిక తెదేపా నాయకులు కార్పొరేషన్ ఎన్నికల కసరత్తుపై సమావేశం నిర్వహించారు. కేశినేని భవన్​కు ఆశావహులు భారీగా చేరుకున్నారు. పోటీ చేసే నేతలు అర్బన్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలని నేతలు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details