మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వారికి విజయవాడ రెండవ పట్టణ ట్రాఫిక్ పోలీసులు అపరాధ రుసుములను విధించారు. ఈ కార్యక్రమాన్ని నగర ట్రాఫిక్ ఏడీసీపీ రవిచంద్ర పర్యవేక్షణలో ఈ తనిఖీలు నిర్వహించారు. మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్న యువతకు ఏడీసీపీ అవగాహన కల్పించారు. మళ్లీ మాస్కులు లేకుండా ఆకతాయిలు ట్రాఫిక్ పోలీసుల కంట పడితే భారీ జరిమానా లేదా క్వారంటైన్‌కు పంపిస్తామని హెచ్చరించారు. సైకిల్‌పై మాస్కు లేకుండా వెళ్లిన వ్యక్తికి జరిమానా విధించారు.
మాస్కులు లేకుండా బయటకొచ్చిన వారికి అపరాధ రుసుములు
విజయవాడ నగరంలోని రెండవ ప్రధాన కూడలి దగ్గర ట్రాఫిక్ కంట్రోల్ రూం సమీపంలో తనిఖీలు చేశారు. మాస్కులు లేకుండా వాహనాలపై వచ్చే వారికి అపరాధ రుసుములు విధించారు. ఈ కార్యక్రమం నగర ట్రాఫిక్ ఏడీసీపీ రవిచంద్ర పర్యవేక్షణలో జరిగింది.
మాస్కు లేకుండా వచ్చిన యువతకు కౌన్సిలింగ్