స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటన దర్యాప్తులో భాగంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. స్వర్ణ ప్యాలెస్ భవనానికి టౌన్ ప్లానింగ్ నుంచి ఎలాంటి అనుమతులు ఉన్నాయి? ఎన్ని అంతస్థులకు అనుమతులు తీసుకున్నారు? అనే విషయాలపై సమాచారాన్ని సేకరించారు. ప్రభుత్వం వేసిన రాష్ట్ర స్థాయి కమిటీ ఈ ఘటనపై నేడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
స్వర్ణ ప్యాలెస్ ప్రమాదస్థలిని పరిశీలించిన టౌన్ ప్లానింగ్ అధికారులు - vijayawada latest news
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం దర్యాప్తులో భాగంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. భవన నిర్మాణ అనుమతులు, ఎన్ని అంతస్థుల వరకూ అనుమతి ఉంది అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఇవాళ నివేదిక అందించనుంది.
స్వర్ణ ప్యాలెస్ ప్రమాదస్థలిని పరిశీలించిన టౌన్ ప్లానింగ్ అధికారులు
జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ నియమించిన కమిటీ కూడా నివేదికను ఇవ్వనుంది. సోమవారం విద్యుత్, అగ్నిమాపక శాఖ అధికారులు స్వర్ణ ప్యాలెస్ ను పూర్తిస్థాయిలో తనిఖీలు చేసి సమాచారం సేకరించారు. కమిటీ.. కొవిడ్ కేర్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న రోగులు, వారికి అందిస్తున్న వైద్యం, ఫీజులు వంటి అంశాలపై ఇప్పటికే సమాచారం సేకరించారు.
ఇదీ చదవండి :మాకు మహానగరాలు లేవు.. మెరుగైనవైద్యం కోసం సహకారం ఇవ్వండి: సీఎం
TAGGED:
vijayawada latest news