ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సంక్రాంతి స్పెషల్: విజయవాడ నుంచి హైదరాబాద్​కు ప్రత్యేక విమానాలు - స్పైస్‌జెట్ తాజా సమాచారం

రానున్న సంక్రాంతి పండుగ దృష్ట్యా విజయవాడ నుంచి హైదరాబాద్​కు ప్రత్యేక విమానాలును ఆరంభమవుతున్నాయి. స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ జనవరి 10 నుంచి 31 వరకు ఈ విమానాలను నడపనున్నట్లు ప్రకటించింది. అందుకు సంభందించిన షెడ్యూల్‌ను సైతం విడుదల చేసింది.

hydarabad to vijayawada pongal  special flights
విజయవాడ నుంచి హైదరాబాద్​కు ప్రత్యేక విమానాలు

By

Published : Jan 3, 2021, 1:22 PM IST

కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయం నుంచి సంక్రాంతికి అదనపు సర్వీసులు ఆరంభమవుతున్నాయి. ఇప్పటికే స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ సంక్రాంతి రద్దీ కోసం జనవరి 10 నుంచి 31వరకు హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాలను ప్రకటించింది. మరికొన్ని విమానయాన సంస్థలు కూడా సంక్రాంతి రద్దీకి అనుగుణంగా సర్వీసులను నడిపే యోచనలో ఉన్నాయి. స్పైస్‌జెట్‌ విమానాలకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది.

● జనవరి 10 నుంచి 31 వరకు ప్రతిరోజు సాయంత్రం 4.30కు హైదరాబాద్‌లో బయలుదేరి ఒక సర్వీసు విజయవాడకు 5.30కు వస్తుంది. తిరిగి విజయవాడ నుంచి సాయంత్రం 6గంటకు ఇదే సర్వీసు బయలుదేరి హైదరాబాద్‌కు రాత్రి 7.10కి చేరుతుంది.

● జనవరి 11 నుంచి 28 మరో కొత్త సర్వీసు ఆరంభమవుతుంది. విజయవాడలో మధ్యాహ్నం 3.20కు బయలుదేరి హైదరాబాద్‌కు 4.10కి చేరుతుంది.

● జనవరి 16 నుంచి మరో సర్వీసు విజయవాడలో బయలుదేరుతుంది. జనవరి 30వరకు ఇది నడుస్తుంది. రోజు మధ్యాహ్నం 3.20కు బయలుదేరి 3.55కు హైదరాబాద్‌కు వెళుతుంది.

ఇదీ చదవండి:

విజయవాడలో సీతమ్మవారి విగ్రహం ధ్వంసం.. విపక్షాల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details