కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి దర్శనం తాత్కాలికంగా నిలిపివేశారు. ఘాట్‌రోడ్డుపై నుంచి రాకపోకలు ఆపేశారు. ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ ఈవో సురేష్‌బాబు దగ్గరుండి... శుక్రవారం అమ్మవారి ఆలయానికి వచ్చిన వారిని త్వరగా దర్శనం చేయించి కొండ నుంచి దిగువకు పంపించేశారు. ప్రతిరోజూ పూజా కార్యక్రమాలు వేదపండితులతో యథావిధిగా జరుగుతాయని ఆలయ ఈవో తెలిపారు. వైరస్ ప్రభావం తగ్గేంత వరకు భక్తులను రావొద్దని సూచించారు.
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం తాత్కాలికంగా నిలిపివేత - vijayawada temple closed due to corona effect
కోవిడ్ ప్రభావం దేశంలో అన్ని ప్రాంతాల్లోని దేవాలయాలకు సోకింది. ఈ కోవలోనే విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ వైరస్ పాకింది. ఫలితంగా ఆలయాన్ని తాత్కాలికంగా శుక్రవారం మూసివేశారు. ఆలయ చైర్మన్, ఈవో స్వయంగా వచ్చి ఘాట్‌రోడ్డుపై నుంచి రాకపోకలను ఆపేశారు.
అమ్మవారి దర్శనం తాత్కాలికంగా నిలిపివేసిన ఆలయ అధికారులు