ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పెంచిన పన్నులను ఉపసంహరించుకోకుంటే.. 11 నుంచి ఆందోళనలు'

పెంచిన పన్నులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని.. రాష్ట్ర పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ సీహెచ్ బాబురావు డిమాండ్​ చేశారు. లేకపోతే రాష్ట వ్యాప్తంగా ఈనెల 11 నుంచి 15వరకు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ch baburao
సీహెచ్ బాబురావు

By

Published : Jul 4, 2021, 8:31 PM IST

ఆస్తి, చెత్త, డ్రైనేజ్ పన్నుల పెంపు జీవోలను ఉపసంహరించుకోవాలంటూ.. జులై 11 నుంచి 15 వ తేదీ వరకు ఆందోళనలు చేపడతామని రాష్ట్ర పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ సీహెచ్ బాబురావు ప్రకటించారు.

18వ తేది నుంచి 20 వరకు ఐక్య వేదికగా రాష్ట్రవ్యాప్త నిరసన దీక్షలు చేపడతామని విజయవాడలో వెల్లడించారు. చెత్త పన్ను, ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకూ పోరాటం సాగుతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details