ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vijayawada:'కేంద్రం చెప్పినా... రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు'

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆ బోర్డు ఛైర్మన్​ శ్రీనివాస నాయుడు డిమాండ్​ చేశారు. కార్మికుల వెల్ఫేర్ ఫండ్ కింద రూ. 2,500 కోట్లు కేటాయించాల్సిన ప్రభుత్వం... ఇంతవరకు ఆ పని చేయలేదని అన్నారు.

construction
భవన నిర్మాణ కార్మికులు

By

Published : Jul 4, 2021, 5:07 PM IST

భవన నిర్మాణ కార్మికులకు డీబీటీ కింద రూ.5 వేల నుంచి 10 వేల వరకు ఇవ్వాలని కేంద్రం సూచించినా... రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని భవన కార్మికుల బోర్డు ఛైర్మన్​ శ్రీనివాస నాయుడు అన్నారు. కార్మికుల వెల్ఫేర్ ఫండ్ కింద రూ. 2,500 కోట్లు కేటాయించాల్సిన ప్రభుత్వం ఇంతవరకు కేటాయించలేదని ఆరోపించారు.

20 లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి పలు సంఘాల నేతలతో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details