Somireddy petition: మంత్రి కాకాణి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి తనపై ఆరోపణలు చేశారన్న సోమిరెడ్డి పిటిషన్‌పై విజయవాడ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈరోజు విచారణకు మంత్రి కాకాణి హాజరుకాకపోవడం వల్ల.. మే 13న తదుపరి విచారణకు హాజరుకావాలని కాకాణితో సహా నలుగురికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలావుంటే కోర్టు వాయిదాలకు కాకాణి హాజరుకాకపోవడాన్ని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తప్పుపట్టారు. కేసు విచారణకు వచ్చేసరికి ఆధారాలు మాయం చేయొచ్చు అంటూ దొంగలు, క్రిమినల్స్‌కి మంత్రి కాకాణి రోల్ మోడల్‌గా నిలిచారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. న్యాయస్థానాల్లో ఆధారాల భద్రత, పతిష్ఠ ఏర్పాట్లుపైనా సరికొత్త చర్చ నడుస్తోందన్నారు.
Somireddy on Kakani: మే 13న విచారణకు రావాలి.. మంత్రి కాకాణికి కోర్టు ఆదేశం - విజయవాడ లేటెస్ట్ అప్డేట్స్
Somireddy petition: కాకాణి తనపై ఆరోపణలు చేశారన్న సోమిరెడ్డి పిటిషన్‌పై విజయవాడ ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను మే 13కు వాయిదా వేసిన న్యాయస్థానం.. వాయిదాకు హాజరుకావాలని కాకాణి సహా నలుగురికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సోమిరెడ్డి పిటిషన్‌పై విజయవాడ ప్రత్యేక కోర్టు విచారణ