ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్సీ యువకుడి లాకప్​డెత్​... మధ్యవర్తితో రాజీయత్నం...! - విజయవాడ లాకప్​డెత్​ లెటెస్ట్ న్యూస్

విజయవాడలో ఎస్సీ యువకుడి లాకప్​డెత్ మరో మలుపు తిరిగింది. మధ్యవర్తి ద్వారా బాధిత కుటుంబ సభ్యులతో అధికారులు రాజీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం అక్రమ రవాణాలో నిందితుడిగా ఉన్న అజయ్​ను ఎస్​ఈబీ అధికారులు గురువారం విచారించారు. ఆ రోజు సాయంత్రమే అజయ్​ మృతి చెందారు. పోలీసుల దెబ్బల వల్లే యువకుడు మృతి చెందాడని ఎస్సీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. గుండెపోటు వల్ల అజయ్ చనిపోయాడని పోలీసులు అంటున్నారు. శవపరీక్షలో వైద్యులు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచలేదు.

ఎస్సీ యువకుడి లాకప్​డెత్
ఎస్సీ యువకుడి లాకప్​డెత్

By

Published : Oct 3, 2020, 4:15 AM IST

Updated : Oct 3, 2020, 6:44 AM IST

విజయవాడలో ఎస్సీ యువకుడి లాకప్‌డెత్‌ కేసు మరో మలుపు తిరిగింది. బాధిత కుటుంబంతో రాజీ కుదుర్చుకునేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. అక్రమంగా మద్యం రవాణా చేసిన కేసులో 11వ నిందితుడిగా ఉన్న డోవారి అజయ్‌ను ఎస్​ఈబీ పోలీసులు గురువారం విచారణ నిమిత్తం తీసుకెళ్లగా ఠాణాలో మృతి చెందాడు. పిట్స్ లక్షణాలు వచ్చి పడిపోతే ఆస్పత్రికి తీసుకెళ్లామని ఈలోపే అజయ్​ గుండెపోటుతో చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక అజయ్‌ చనిపోయాడని ఎస్సీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మధ్యవర్తి ద్వారా రాజీ..!

విజయవాడ జీజీహెచ్​లో నిర్వహించిన శవపరీక్షలో వైద్యులు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచలేదు. ఫోరెన్సిక్‌ పరీక్ష ఫలితాలు వచ్చాకే కారణం తెలుస్తుందని అంటున్నారు. అజయ్‌ 87 కిలోలతో వయసుకు మించి అధిక బరువున్నట్లు తెలిపారు. యువకుడి మరణంపై కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనా....నిందితుల పేర్లను మాత్రం చేర్చలేదు. ఈ అంశం వివాదం కాకుండా ఉండేందుకు....అధికారులు మధ్యవర్తి ద్వారా కుటుంబసభ్యులతో రాజీ నడుపుతున్నట్లు చెబుతున్నారు. పరిహారంగా రూ.15 లక్షలు, 100 గజాల నివేశన స్థలం, కుటుంబంలో ఒకరికి ఒప్పంద ఉద్యోగం ఇచ్చేందుకు హామీ లభించినట్లు సమాచారం. గురువారమే ఈ ఒప్పందం జరిగిందని తెలుస్తోంది. కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎస్సీ సంఘాలు ఆందోళనను విరమించాయి.

ఇదీ చదవండి :జమిలి ఎన్నిలకు సిద్ధం కావాలి... పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

Last Updated : Oct 3, 2020, 6:44 AM IST

ABOUT THE AUTHOR

...view details