ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ROBBERY CASE CHASED: పాత గుమస్తానే అసలు దొంగ.. పట్టుకున్న పోలీసులు - క్రైమ్ వార్తలు

విజయవాడలో దారి దోపిడీలో ఆరున్నర లక్షలు దొంగిలించిన కేసును పోలీసులు చాకచక్యంగా పరిష్కరించారు. యజమాని వద్ద గుమస్తాగా పని చేసిన వ్యక్తే అసలు దొంగ అని గుర్తించారు. సొమ్మును అతని వద్ద నుంచి రికవరీ చేశారు.

ROBBERY CASE CHASED
ROBBERY CASE CHASED

By

Published : Sep 27, 2021, 5:30 AM IST

విజయవాడలో స్నేహితులతో కలసి బంగారం దుకాణం యజమానిని బెదిరించి దారిదోపిడీకి పాల్పడిన వ్యక్తి.. ఆ దుకాణంలోనే గుమస్తాగా పనిచేసిన వ్యక్తేనని పోలీసులు(vijayawada robbery case chased by police) తేల్చారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివసించే కోటేశ్వరరావు రోల్డ్ గోల్డ్ వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారం చేసిన నగదును నిత్యం రాత్రి సమయంలో ఇంటికి తీసుకెళతాడు. ఈ విషయం తెలుసుకున్న దుకాణంలో పనిచేసే వ్యక్తి మోహన్‌... ఆ డబ్బును దోచుకునేందుకు స్నేహితులతో కలసి పక్కా ప్రణాళిక రచించాడు. ఈ నెల 23న రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఇంటికి వెళ్తున్న కోటేశ్వరరావు చేతిలోని ఆరున్నర లక్షల రూపాయలను లాక్కుని పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మోహన్‌ను ప్రశ్నించగా దోపిడీ చేసినట్లుగా అంగీకరించాడు. ఆయనతోపాటు మరో ఇద్దర్ని అరెస్టు చేసిన పోలీసులు ఆరున్నర లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

అసలు ఏం జరిగిందంటే..

విజయవాడ సత్యనారాయణపురంలో దారిదోపిడీ(ROBBERY) సంఘటన చోటు చేసుకుంది. సత్యనారాయణపురం ఓగిరాలవారి వీధిలో రాత్రి సమయంలో పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న వ్యాపారి శనగపల్లి కోటేశ్వరరావుపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. వ్యాపారిని బెదిరించి.. అతని వద్దఉన్న బ్యాగ్ లాక్కొని పారిపోయారు. ఈ ఘటనలో సుమారు రూ. 6 లక్షల సొమ్ము చోరీకి గురైనట్లు బాధితుడు కోటేశ్వరరావు తెలిపారు. దీనిపై బాధితుడు సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు.

ఇదీ చదవండి:

'తెలుగు సినీ పరిశ్రమకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ల లాంటివి'

ABOUT THE AUTHOR

...view details