ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 2, 2021, 10:26 AM IST

ETV Bharat / city

విజయవాడ రైల్వే డివిజన్‌ ఘనత... రికార్డు స్థాయిలో గూడ్స్‌ రైళ్ల బదలాయింపు

విజయవాడ రైల్వే డివిజన్‌ గూడ్స్‌ రవాణాలో రికార్డు సాధించింది. ఆదివారం రికార్డు స్థాయిలో డివిజన్‌కు వచ్చే 122 రైళ్లతో పాటు ఇక్కడి నుంచి వెళ్లే మరో 120 రైళ్లను విజయవంతంగా బదలాయించారు.

vijayawada railway division record
విజయవాడ రైల్వే డివిజన్‌ ఘనత

విజయవాడ రైల్వే డివిజన్‌ గూడ్స్‌ రవాణాలో మరో ఘనతను సాధించింది. ఒక్క రోజే 242 రైళ్లను ఇతర డివిజన్లకు అప్పగించి రికార్డులకు ఎక్కింది. సరకు రవాణాపై గూడ్స్‌ రైళ్ల ద్వారా ఏటా రికార్డు స్థాయిలో కోట్లాది రూపాయల ఆదాయం ఈ డివిజన్‌కు లభిస్తోంది. ఇందులో ఆపరేటింగ్‌ విభాగం కీలక పాత్ర పోషిస్తోంది. సాధారణంగా రోజూ డీఆర్‌ఎం కార్యాలయంలో రైల్వే కంట్రోలర్లు, ఆపరేటింగ్‌ సిబ్బంది 160 గూడ్స్‌ రైళ్లను నిర్ణీత వ్యవధిలో అప్పగిస్తుంటారు.

ఇందుకు భిన్నంగా ఆదివారం డివిజన్‌కు వచ్చే 122 రైళ్లతో పాటు ఇక్కడి నుంచి వెళ్లే మరో 120 రైళ్లను విజయవంతంగా అప్పగించారు. రైళ్ల వేగం పెరగడం, ట్రాక్‌ పటిష్ఠత, అధికారులు, సిబ్బంది అప్రమత్తతో ఇది సాధ్యపడింది. ఈ ఘనత సాధించిన విజయవాడ సీనియర్‌ డివిజనల్‌ ఆపరేటింగ్‌ అధికారి (సీనియర్‌ డీవోఎం) వి.ఆంజనేయులుతో పాటు కంట్రోలర్లు, సిబ్బందిని డీఆర్‌ఎం శ్రీనివాస్‌ ప్రత్యేకంగా అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details