ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బిరబిరా కృష్ణమ్మ.. ప్రకాశం బ్యారేజీ గేట్లెత్తిన అధికారులు! - ప్రకాశం బ్యారేజీ

ప్రకాశం బ్యారేజీకి వ‌ర‌ద‌నీరు పోటెత్తుతోంది. ఎగువ నుంచి 42 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు వెల్లడించారు. వరద ప్రవాహం ఇంకా పెరుగుతుండడంతో.. అధికారులు గెట్లెత్తి, దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

prakasam
prakasam

By

Published : Jul 10, 2022, 7:23 PM IST

విజ‌య‌వాడ‌ ప్రకాశం బ్యారేజీకి వ‌ర‌ద‌నీరు భారీగా వ‌చ్చి చేరుతోంది. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో.. అధికారులు గెట్లెత్తి.. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 42 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని అధికారులు వెల్లడించారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయడం.. ఈ సీజన్‌లో ఇదే తొలిసారి. ఇప్పటికే కాల్వల ద్వారా ఖరీఫ్ సాగుకు కృష్ణా తూర్పు, పడమరకు నీటిని విడుదల చేశారు. ఇప్పుడ వరద ప్రవాహం కారణంగా.. ఏకంగా 25 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పరీవాహక ప్రాంతాల ప్రజలు మరో రెండు రోజులపాటు పశువులను ఈ పక్కకు తీసుకెళ్లొద్దని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details