RESTRICTIONS ON NEW YEAR CELEBRATIONS: కొత్త సంవత్సర వేడుకలపై విజయవాడ పోలీసు ఆంక్షలు - ap news
13:16 December 30
NEW YEAR CELEBRATIONS: విజయవాడలో కొత్త సంవత్సర వేడుకలపై అంక్షలు..
NEW YEAR CELEBRATIONS: కరోనా నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలపై విజయవాడ పోలీసుల ఆంక్షలు విధించారు. రేపు రాత్రి బహిరంగ వేడుకలకు అనుమతి లేదని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. రాత్రి 12 గంటల వరకే ఇండోర్ వేడుకలకు అనుమతి ఉండనున్నట్లు వెల్లడించారు. అర్ధరాత్రి రోడ్లపై ఎవరూ తిరగకూడదని ఆదేశాలు జారీ చేశారు. బందరు, ఏలూరు, బీఆర్టీఎస్ రోడ్లు, పైవంతెనలు మూసివేస్తున్నట్లు సీపీ తెలిపారు. 15 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యువత 2022ను కూడా బాధాకరంగా మార్చుకోవద్దని హితవు పలికారు. వేడుకలలో సామర్థ్యానికి మించి ఎక్కువ మందికి అనుమతి లేదని సీపీ కాంతి రాణా టాటా అన్నారు.
ఇదీ చదవండి: