ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దుర్గ గుడి వెండి సింహాల కేసులో నిందితులు అరెస్టు.. చోరీ ఎలా జరిగిందంటే? - దుర్గ గుడిలో వెండి విగ్రహాలు చోరి వార్తలు

గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం స్పష్టించిన బెజవాడ దుర్గగుడి వెండిసింహాల చోరీ కేసులో ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు పోలీసులు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్థుడు సహా ఓ బంగారం వ్యాపారిని అరెస్టు చేశారు. వెండి సింహాల ప్రతిమలను వ్యాపారి కరిగించాడని పోలీసులు వెల్లడించారు.

3 silver lion statues theft
3 silver lion statues theft

By

Published : Jan 23, 2021, 5:38 PM IST

Updated : Jan 23, 2021, 5:45 PM IST

కేసు వివరాలు వెల్లడిస్తున్న సీపీ శ్రీనివాసులు

బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రథానికి ఉండే 3 వెండి సింహాల ప్రతిమల మాయం కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. గతేడాది అక్టోబరు 17న జరిగిన ఈ ఘటనలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్థుడు సాయిబాబా, బంగారం వ్యాపారి కమలేశ్​ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను సీపీ శ్రీనివాసులు, సిట్‌ చీఫ్‌ అశోక్‌కుమార్‌ శనివారం మీడియాకు వెల్లడించారు.

'గతేడాది జూన్ చివరల్లో ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మను దర్శించుకున్నాడు సాయిబాబా. కొండ మీద నుంచి కిందకు వస్తుండగా రథానికి ఉన్న విగ్రహాలను చూశాడు. ఎలాగైనా వాటిని దోచేయాలని అనుకున్నాడు. అక్కడినుంచి ఊరెళ్లిన అతను... కొన్నిరోజుల తరువాత తిరిగి వచ్చి రాత్రివేళ గోడ దూకి రథం వద్దకు చేరుకున్నాడు. ఇనుప రాడ్లతో మూడు వెండి సింహాల విగ్రహాలను తొలగించాడు. నాలుగో విగ్రహం రాకపోవటంతో వదిలేశాడు. వెంటనే మూడు ప్రతిమలను తీసుకుని వెళ్లిపోయాడు. వాటిని 35 వేల రూపాయలకు తణుకులోని బంగారం వ్యాపారి కమలేశ్​కు అమ్మేశాడు. అనంతరం ఆ వ్యాపారి విగ్రహాలను కరిగించాడు' అని పోలీసులు వెల్లడించారు. చోరీకి గురైన విగ్రహాల బరువు దాదాపు 16 కిలోలు ఉన్నాయని చెప్పారు. ఇందులో నిందితుల నుంచి 9 కిలోల వెండి దిమ్మెలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇతర ఆలయాల్లో చోరీ చేసిన 6.4 కిలోల వెండి దిమ్మెలూ స్వాధీనం చేసుకున్నామని సీపీ శ్రీనివాసులు వివరించారు.

Last Updated : Jan 23, 2021, 5:45 PM IST

ABOUT THE AUTHOR

...view details