Vijayawada CP On Year Crime Report: గతేడాది కంటే ఈ ఏడాది విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో కేసుల సంఖ్య 23 శాతం పెరిగాయని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాదికి సంబంధించిన నేర నివేదికను నగర పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా విడుదల చేశారు.
"నగరంలో మొత్తం 2021లో 6,887 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ప్రాపర్టీ కేసులు 1,358 నమోదయ్యాయి. ఈ కేసుల్లో రూ. 12.89 కోట్లు చోరీ కాగా.. రూ. 9.56 కోట్లు రికవరీ చేశాం. 2021లో 486 శారీరక బాధిత కేసులు నమోదు కాగా.. అందులో 29 హత్య కేసులున్నాయి. వీటిలో 28 కేసుల్లో నిందితులను అరెస్టు చేశాం. మహిళలపై జరిగిన నేరాల్లో 1,384 కేసులు నమోదు చేశాం. దిశ యాప్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 512 కేసులు పెట్టాం. 5,98,207 మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. 2021లో జరిగిన 1,121 రోడ్డు ప్రమాదాల్లో 277 మంది మృతి చెందారు. ఈ ఏడాది 126 సైబర్ క్రైం కేసులు నమోదయ్యాయి. 3,506 లాక్డౌన్ కేసులు నమోదయ్యాయి. 3,080 కేసులు విచారణలో ఉన్నాయి. 66 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కాగా..47 కేసుల్లో నిందితులను అరెస్టు చేశాం. 27 కేసుల్లో ఛార్జిషీటు వేశారు. మోటార్ వెహికల్ చట్టం కింద 7.17 లక్షల కేసులు నమోదు చేశాం. 145 గంజాయి కేసుల్లో 1.52 కోట్ల విలువైన గంజాయి సీజ్ చేశాం. 139 గుట్కా కేసుల్లో 3.05 కోట్ల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. 264 లిక్కరు కేసుల్లో..360 మంది అరెస్టు చేసి..,రూ. 74.44 లక్షల విలువైన లిక్కర్ సీజ్ చేశాం. ఈ ఏడాది 13 మంది రౌడీషీటర్లను నగర బహిష్కరణ చేసాం." -కాంతిరాణా టాటా , విజయవాడ సీపీ