విజయవాడలో రౌడీషీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వారం రోజుల్లో ఇద్దరు రౌడీషీటర్లపై పోలీసు కమిషనర్ నగర బహిష్కరణ విధించారు. ఈనెల 2న భవానీపురానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌ను 6 నెలలపాటు నగరం నుంచి బహిష్కరించగా.. తాజాగా కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్ భూపతి చంద్రశేఖర్ అలియాస్ చందును 6 నెలల పాటు నగరంలో కనిపించకూడదని ఆదేశాలు జారీ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవరిస్తున్నందున నగర బహిష్కరణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విజయవాడ రౌడీషీటర్ల నగర బహిష్కరణ
ఇటీవల విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్ దృష్ట్యా పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న రౌడీషీటర్లను నగర బహిష్కరణ చేస్తున్నారు. వారం రోజుల్లో ఇద్దరు రౌడీషీటర్లను పోలీసు కమిషనర్ నగరంలో కనిపించకూడదని ఆదేశాలు ఇచ్చారు.
విజయవాడ రౌడీషీటర్ల నగర బహిష్కరణ