ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మూడేళ్ల కిందట దొంగతనం...ఇప్పుడు అరెస్ట్ - crime news in Vijayawada

విజయవాడలో మూడేళ్ల కిందట నడిరోడ్డుపైనే కత్తులతో బెదిరించి బంగారు దోచుకెళ్లిన దొంగను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. అసలు దొంగతనం ఎలా జరిగింది... నిందితుడ్ని ఎలా పట్టుకున్నారో మీరు తెలుసుకోండి.

Vijayawada police arrest famous thief wh theft gold from  3 years back
Vijayawada police arrest famous thief wh theft gold from 3 years back

By

Published : May 27, 2020, 11:32 PM IST

మూడేళ్ల కిందట విజయవాడలో సంచలనం రేపిన బంగారం దొంగతనం కేసులో కీలక నేరస్తుడు బల్బీర్ సింగ్, బల్వంత్ సింగ్ రావత్​ ఆచూకీ దొరికొంది. ముంబయి యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ బల్బీర్ సింగ్​ను కొద్దిరోజుల కిందట అరెస్ట్ చేశారు.

మావోయిస్టులకు బల్బీర్ కు సంబంధాలున్నాయని పక్కా సమాచారంతో ఏటీఎస్ బృందం అతన్ని అరెస్ట్ చేసింది. విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. మూడేళ్ల కిందట సంచలనం రేపిన దోపిడీ కేసులో కీలక నిందితుడని తేలింది. దోచిన సొత్తును మావోయిస్టులకు సంబంధించిన కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు .

2017 జూలైన11న రద్దీ సమయంలోనే కత్తులు, తుపాకులతో బెదిరించి విజయవాడలో ఆరుగురు నిందితులు లక్షల రూపాల విలువ చేసే బంగారాన్ని దోచుకెళ్లారు. దీనిపై ప్రత్యేక బృందాలు ముంబయి వెళ్లి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి 4 కేజీలకుపైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే కీలక నిందితుడు బల్బీర్ సింగ్ తప్పించుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిందితుడు పరారీ లోనే ఉన్నాడు. ముంబయి పోలీసుల విచారణలో బయటపడటంతో విజయవాడ పోలీసులకు సమాచారమిచ్చారు. బల్బీర్ ను మహారాష్ట్ర నుంచి విజయవాడ తీసుకొచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

ఇదీ చూడండి

డిజిటల్ ఫ్లాట్​ ఫాంపై 'పసుపు జెండా'.. ఇది ఓ ప్రయోగమే!

ABOUT THE AUTHOR

...view details