గణేశ్ నిమజ్జనానికి విజయవాడ పోలీసులు ప్రకాశం బ్యారేజి వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు డీసీపీ బాబూరావు తెలిపారు. నగరం నలుమూలల నుంచి విగ్రహాలు తీసుకుని ఆటోల్లో తరలివచ్చిన భక్తులు విగ్రహాలను నిమిజ్జనం చేసేందుకు క్యూ కట్టారు. 150 మంది పోలీసులతో నిమజ్జనాన్ని పర్యవేక్షిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. వినాయక విగ్రహంతో ఐదుగురిని మాత్రమే అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు.
'నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు.. కేవలం ఐదుగురికే అనుమతి' - prakasam district news
విజయవాడలో గణేశ్ నిమజ్జనానికి పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలోనే వ్యక్తులను అనుమతిస్తున్నారు.
నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు