జనం కోసం... మన కోసం... అందరం సంఘటితం అవుదాం. జనతా కర్ఫ్యూ పాటిద్దాం... కరోనా మహమ్మారిపై పోరాడదామనే నినాదానికి... రాష్ట్రం స్వచ్ఛందంగా మద్దతు తెలుపింది. విజయవాడ నగరంలో కాలనీలన్నీ నిర్మానుష్యంగా మారాయి. జనతా కర్ఫ్యూలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఉదయం నుంచి ఇంట్లోనే ఉండి అధికారుల సూచనలు పాటిస్తున్నారు. దీనివల్ల కరోనా వైరస్ వ్యాప్తిని కచ్చితంగా అరికట్టవచ్చని భావిస్తున్నారు. ఇంట్లోనే శానిటైజర్స్, సామాజిక దూరం పాటించటం అవసరమని వైద్యులు చెపుతున్నారు. విజయవాడ కాలనీల్లో పరిస్థితిపై మాప్రతినిధి పూర్తి వివరాలందిస్తారు.
కరోనాపై పోరుకు అందరూ సంఘటితం - విజయవాడలో జనతా కర్ఫ్యూ
విజయవాడలో రవాణా వ్యవస్థ తాత్కాలికంగా స్తంభించింది. జనం ఎవరి ఇళ్లలో వారు ఉండిపోయారు. మానవాళిపై పడగ విప్పిన కరోనా మహమ్మారిపై యుద్ధానికి స్వచ్ఛందంగా ఏకమయ్యారు. ప్రధాని పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో భాగమయ్యారు.
janatha curfew