ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రసాభాసాగా విజయవాడ కౌన్సిల్ సమావేశం.. - విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం

వాదనలు, ఉద్రిక్తల మధ్యే చెత్తపన్ను వసూలుకు విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. నివాసేతర ప్రాంతాల్లో వ్యాపారులపై మోపే చెత్తపన్నుల భారాలపై తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. కరోనా సమయంలో ప్రజలపై పన్నుల భారాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించటంతో.. సమావేశం ఉద్రిక్తంగా మారింది. కార్పొరేటర్ల అరెస్టులకు వరకూ పరిస్థితి దారితీయటంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.

vijayawada municipal council
విజయవాడ కౌన్సిల్ సమావేశం..

By

Published : Jul 16, 2021, 7:49 AM IST

రసాభాసాగా విజయవాడ కౌన్సిల్ సమావేశం

విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. విపక్షం లేకుండానే ఏకపక్ష తీర్మానాలతో సమావేశం సాగింది. ప్రజలపై పన్నుల భారాన్ని నిరసిస్తూ నల్ల కండువాలతో తెలుగుదేశం, సీపీఎం సభ్యులు హాజరయ్యారు. పన్ను పెంచుతూ.. అధికార పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానాలను ప్రతిపక్షాలు తీవ్రంగా అడ్డుకోవటంతో.. వారిని సభ నుంచి సస్పెండ్‌ చేశారు. ఇది అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదానికి దారితీసింది.

అయినా వెనక్కితగ్గని ప్రతిపక్ష కార్పొరేటర్లు కౌన్సిల్‌ వద్దే ఆందోళనకు దిగటంతో.. పోలీసులు వారిని అరెస్టు చేసి గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈలోగా ఏకపక్ష తీర్మనాలతో చెత్తపై పన్ను వసూలుకు కౌన్సిల్‌ ఆమోదించింది. దీంతో జూన్‌ నుంచీ మురికివాడల ప్రాంతాల్లోని ప్రజల నుంచి నెలకు 30 రూపాయల చొప్పున.. మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లో కుటుంబాల నుంచి నెలకు 120 రూపాయల చొప్పున వసూళ్లు చేయనున్నారు. చెత్తరూపంలో సేకరించే ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు, పూల వ్యర్థాలను సేకరించి ప్రాసెసింగ్, రీసైక్లింగ్‌ చేసే రెండు యూనిట్లను నెలకొల్పాలని కౌన్సిల్‌ తీర్మానించింది.


కరోనా కష్టకాలంలో ప్రజలపై మోపిన పన్నుల భారాన్ని రద్దుచేసే వరకూ తాము వెనక్కి తగ్గేది లేదని ప్రతిపక్షాలు తేల్చి చెప్పాయి. అరెస్ట్‌ అయిన కార్పొరేటర్లను ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్‌, సీపీఎం నేత బాబూరావు పరామర్శించారు. ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేస్తే సామాన్యుడు బతికే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. 3 వేల 274 మంది పొరుగుసేవల పారిశుద్ధ్య కార్మికుల పనికాలాన్ని మరో 9 నెలలు పెంచటమేగాక.. వేతనం బకాయిలు దాదాపు 15 కోట్ల మంజూరుకు తీర్మానించారు.

ABOUT THE AUTHOR

...view details