విజయవాడ నగరంలోని పోలింగ్ బూత్‌లను మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. నడవలేని ఓటర్లకు పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ ఛైర్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్‌లకు వచ్చే ప్రతి ఒక్కరికీ శానిటైజర్ అందిచడంతోపాటు మాస్కు ధరించాలని సూచించారు. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
'ఓటర్లు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి' - పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ప్రసన్న వెంకటేశ్ న్యూస్
నగరంలోని పోలింగ్ బూత్‌లను విజయవాడ నగరపాలక కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. ఈరోజు ఉదయాన్నే పోలింగ్ ప్రారంభం కాకముందే బయలుదేరి వసతులు ఎలా ఉన్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

'ఓటర్లు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి'