విజయవాడ మొగల్రాజపురం పోలింగ్ బూత్‌లో ఈవీఎంలు మధ్యాహ్నం వరకూ పని చేయలేదు. ఎన్ని ఈవీఎంలు మార్చినా పోలింగ్ ప్రారంభం కాకపోవటంపై ప్రజలు అసహనానికి గురయ్యారు. పోలింగ్ బూత్‌లు వద్ద సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఈసీ అధికారులపై ఓటర్లు ధ్వజమెత్తారు.ఎన్నికల అధికారుల తీరును నిరసిస్తూ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, జడ్పీ ఛైర్ పర్సన్ గద్దె అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైనందువల్ల సమయాన్ని పొడిగించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు తెలంగాణలో ఎన్నికలు సవ్యంగానే జరుగుతున్నా ఇక్కడ మాత్రం ఈవీఎంల సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.
మొగల్రాజపురంలో ఆలస్యంగా పోలింగ్.. సమయం పెంచాలని డిమాండ్ - ap polling 2019
ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఈసీ అధికారుల తీరును ఇప్పటివరకూ చూడలేదని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. మధ్యాహ్నం వరకూ ఈవీఎంలు పని చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు కల్పించటంలో అధికారులు విఫలమయ్యారని ఈసీపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొగల్రాజపురంలో మొరాయించిన ఈవీఎంలు
మొగల్రాజపురంలో మొరాయించిన ఈవీఎంలు
Last Updated : Apr 11, 2019, 6:22 PM IST