మాస్కూలు ధరించకుండా రోడ్ల మీద వెళ్తున్న వారికి.. విజయవాడ మాచవరం సీఐ కౌన్సిలింగ్ నిర్వహించారు. మాస్కు పెట్టుకోకపోవడం వల్ల కలిగే అనర్థాలను యువకులు, ద్విచక్ర వాహనదారులకు వివరించారు. మరోసారి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే.. భారీ జరిమానాలు, శిక్షలు తప్పవని హెచ్చరించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని పలుప్రాంతాలలో ఈరోజు సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహించారు. మాచవరం ప్రధాన వీధులలో తిరుగుతూ.. మాస్కులు ధరించని ప్రజలకు అవగాహన కల్పించారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు.