విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమల్లేశ్వర స్వామి ఆలయం, ఇతర ఉపాలయాల్లో సూర్యగ్రహణం ముగిసిన తర్వాత ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈవో సురేష్ బాబు సమక్షంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో దేవతా మూర్తులకు స్నాపది కార్యక్రమాలు చేపట్టారు. అమ్మవారికి పంచ హరతుల అనంతరం ఆలయాన్ని మూసివేశారు. సోమవారం ఉదయం నుంచి యథావిధిగా భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
సోమవారం నుంచి యథావిధిగా బెజవాడ దుర్గమ్మ దర్శనం - విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వార్తలు
సోమవారం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తులను యథావిధిగా అనుమతించనున్నారు. ఆదివారం సూర్యగ్రహణం సందర్భంగా ఆలయం మూసివేశారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయ శుద్ధి చేసి తిరిగి మూసేశారు.
సోమవారం నుంచి యథావిధిగా బెజవాడ దుర్గమ్మ దర్శనం