ముత్తంశెట్టి ప్రసాద్ బాబు సమాజంలో మంచి మార్పు తీసుకొచ్చే నాయకులకు పట్టం కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయవాడ జనసేన ఎంపీ అభ్యర్థి ముత్తంశెట్టి ప్రసాద్ బాబు ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సేవా భావంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టానని స్పష్టం చేశారు. రాజకీయాలు కొత్తైనా.. సేవ చేయడం కొత్త కాదని చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న రోజుల్లో... ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తనకు జనసేన ఎంపీ సీటు ఇచ్చారని ప్రసాద్ బాబు తెలిపారు. విజయవాడ ప్రజలు ఆశీర్వదించి తనను ఎంపీగా గెలిపిస్తే.... కేంద్ర నిధులతో ఆదర్శవంతమైన పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీగా గెలిస్తే చేసే పనులను వివరిస్తూ ప్రసాద్ బాబు ప్రమాణ పత్రం విడుదల చేశారు.
ఇదీ చదవండి