విజయవాడ గుణదల మేరిమాత ఆలయంలో నవదిన ప్రార్థనలు మెుదలయ్యాయి. ఈ సందర్భంగా మదర్ థెరిస్సా నూతన విగ్రహాన్ని... గుణదల మేరీ మాత పీఠాధిపతి బిషప్ రెవరెండ్ ఫాదర్ తెలగతోటి జోసఫ్ రాజారావు ఆవిష్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మేరీ మాత పతాకాన్ని ఎగరవేశారు.
తొమ్మిది రోజుల గుణదల మేరీ మాత తిరునాళ్లను లాంఛనంగా ప్రారంభించారు. సమిష్టి దివ్య బలిపూజ, సమిష్టి ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెతోలికా పీఠం మోన్సిగ్నోర్ ఫార్ మువ్వల ప్రసాద్, పలువురు పీఠాధిపుతులు పాల్గొన్నారు.