విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ పబ్లిక్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వేమూరి సాయిఅక్షర గణితంలో అద్భుత ప్రతిభ కనబరిచింది. వర్చువల్ విధానంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ప్రదర్శనలో రూట్ 2 విలువను 6,020 దశాంశాల(డెసిమిల్స్) వరకు కళ్లు మూసుకుని 5.12 నిమిషాల్లో అనర్గళంగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకూ 60.08 నిమిషాల్లో 6,002 డెసిమల్స్‌తో ఉన్న ప్రపంచ రికార్డును అధిగమించింది. ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు సాయిఅక్షరకు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. తల్లిదండ్రులు బుజ్జి, సుజనశ్రీల ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించినట్లు బాలిక తెలిపింది. సాయి అక్షర గణితంలోనే కాకుండా అనేక అంశాల్లో ప్రతిభ చాటుతోంది. విలువిద్యలోనూ జాతీయ స్థాయి క్రీడాకారిణిగా రాణించింది. సొంతంగా ఆస్ట్రానమీ క్లబ్‌ను స్థాపించి చిన్నారులకు ఆ రంగంపై ఆసక్తి కలిగించేలా కృషి చేస్తోంది.
విజయవాడ బాలికకు ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు - విజయవాడ తాజా వార్తలు
వేమూరి సాయిఅక్షర గణితంలో తన ప్రతిభను కనబరిచింది. వర్చువల్ విధానంలో నిర్వహించిన ప్రదర్శనలో రూట్ 2 విలువను 6020 డెసిమిల్స్ వరకు కళ్లు మూసుకుని 5.12 నిమిషాల్లో అనర్గళంగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.
Vijayawada