విజయవాడలో సంచలనం రేపిన పటమట గ్యాంగ్ వార్ ఘటనపై పోలీసులు 6 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడి జరగటానికి ముందు రోజు మణికంఠ అలియాస్ కేటియం పండు టిక్ టాక్ చేశాడని... సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
కొంతకాలంగా తోట సందీప్, మణికంఠ అలియాస్ కేటియం పండు ముఠాల మధ్య ఆర్ధిక లావాదేవీలతో పాటు ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కొన్నాళ్లు ఇద్దరూ కలిసే సెటిల్ మెంట్స్ చేసేవారు.