విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ ఇంతియాజ్, ఆర్ అండ్ బి అధికారులు పరిశీలించారు. ప్రారంభం అయ్యాక ఫ్లైఓవర్‌పై ఆర్అండ్బి మంత్రి శంకర్ నారాయణ, అధికారులు మొదటగా ట్రావెల్ చేయనున్నారు. కనకదుర్గ ఫ్లైఓవర్ తోపాటు రాష్ట్రవ్యాప్తంగా 16 కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయి. రాష్ట్రానికి సంబంధించి 15,592 కోట్ల రూపాయల అంచనాలతో 16 ప్రాజెక్టుల పనులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి.
కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు - Vijayawada Flyover opening news
కనకదుర్గ ఫ్లైఓవర్ శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. రాష్ట్రానికి సంబంధించి 15,592 కోట్ల రూపాయల అంచనాలతో 16 ప్రాజెక్టుల పనులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు కూడా జరగనున్నాయి
కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు
Last Updated : Oct 15, 2020, 9:49 PM IST