అమరావతి రైతులకు మద్దతుగా విజయవాడ పోరంకిలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నిరసన దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు సంఘీభావం తెలిపారు. నేతలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు మేధావులు మాట్లాడకపోవటం వల్లే రాష్ట్రానికి దుర్భర పరిస్థితి వచ్చిందని దేవినేని ఉమ అన్నారు. రైతుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే... మూడు రాజధానుల ప్రతిపాదన అని దేవినేని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా ప్రజలంతా పోరాటం కొనసాగించాలని సూచించారు. రాజకీయ కక్షతోనే సీఎం జగన్ మూడు రాజధానులంటున్నారని బోడె ప్రసాద్ మండిపడ్డారు.
రాజధాని రైతులకు మద్దతుగా బోడె ప్రసాద్ దీక్ష - అమరావతికి మద్దతుగా బోడె ప్రసాద్ దీక్ష
అమరావతి రైతులకు మద్దతుగా విజయవాడ పోరంకిలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చేస్తున్న దీక్షకు.. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మద్దతు తెలిపారు. రైతుల కోసం తాము చేస్తున్న పోరాటం.. లక్ష్యాన్ని సాధించేవరకు కొనసాగుతుందని స్పష్టంచేశారు.
అమరావతికి మద్దతుగా విజయవాడలో బోడె ప్రసాద్ దీక్ష