వైకాపా భవిష్యత్తు నాయకుడు లేని పార్టీ అని మాజీమంత్రి జవహర్ విమర్శించారు. జగన్ రెడ్డి జైలుకెళ్తే ఖచ్చితంగా వైకాపా ముక్కలవుతుందన్నారు. కొవిడ్‌పై చంద్రబాబు చేసిన సూచనల్ని మంత్రులు విమర్శిస్తుండటం హాస్యాస్పదమని మండిపడ్డారు. హవాలా సొమ్ముతో పట్టుబడిన బాలినేనిపై సక్రమంగా విచారణ జరిగితే ఊచలు లెక్కపెట్టాల్సిందేనని ధ్వజమెత్తారు.
'వైకాపా భవిష్యత్తు నాయకుడు లేని పార్టీ' - YSRCP
సీఎం జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తే ఖచ్చితంగా వైకాపా ముక్కలవుతుందని మాజీమంత్రి జవహర్ అన్నారు. కొవిడ్ పై చంద్రబాబు చేసిన సూచనల్ని మంత్రులు విమర్శిస్తుండటం హాస్యాస్పదమని మండిపడ్డారు.
మాజీమంత్రి జవహర్
ప్రజలకు ఇచ్చే సంక్షేమం కంటే ఆర్థిక వేత్తలకు కూడా అంతుబట్టని పన్నులు జగన్ రెడ్డి విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం కట్టించే ఇళ్లను సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి:విజయవాడలో గుబులు రేపుతున్న సైకో విహారం