కరోనా వ్యాక్సిన్ రూపకల్పనలో భారత్ బయోటెక్ చేస్తున్న కృషి అభినందనీయమని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, ఆయన సతీమణి అనురాధ అన్నారు. భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ ప్రయోగాత్మక పరీక్షల్లో భాగస్వాములైనందుకు ఆనందంగా ఉందన్నారు. సైన్స్ విద్యార్థులుగా బాధ్యతతో ప్రయోగాలకు స్వచ్ఛందంగా సహకరించినట్లు గద్దె రామ్మోహనరావు దంపతులు తెలిపారు.
కొవాగ్జిన్ వాలంటీర్లుగా ఎమ్మెల్యే గద్దె దంపతులు - కొవాగ్జిన్ ట్రయల్ రన్ వార్తలు
భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ ట్రయల్రన్కు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు వాలంటీర్లుగా చేరారు. తొలి ట్రయల్లో వారివురూ టీకా వేయించుకున్నారు. రెండో ట్రయిల్లో జనవరి 4న టీకా వేయించుకోనున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులతో ఈటీవీ భారత్ ముఖాముఖి
Last Updated : Dec 10, 2020, 1:03 AM IST