ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Durga Temple: భారీగా పెరిగిన దుర్గమ్మ హుండీ ఆదాయం.. ఎంతంటే! - దుర్గా మాత హుండీ ఆదాయం వార్తలు

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో కనకదుర్గమ్మ హుండీకి సమకూరిన ఆదాయం బాగా పెరిగింది. పదకొండున్నర కోట్లు ఆదాయం రాగా.. లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయడానికి మూడు రోజుల సమయం పట్టింది.

VIJAYAWADA DURGAMMA HUNDI INCOME CALCULATION
VIJAYAWADA DURGAMMA HUNDI INCOME CALCULATION

By

Published : Oct 28, 2021, 12:17 PM IST

విజయవాడ కనక దుర్గమ్మ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి రూ.11.50 కోట్ల నగదు వచ్చినట్లు ఆలయ అధికారులు చెప్పారు. హుండీల్లో ఆదాయం ఏడున్నర కోట్లు కాగా.. దర్శనం టికెట్లు, లడ్డు ప్రసాదాల ద్వారా దాదాపు నాలుగు కోట్ల రూపాయలు సమకూరాయన్నారు. కేజీ 448 గ్రాముల బంగారం, ఇరవై ఆరున్నర కిలోల వెండి హుండీల్లో కానుకల రూపంలో వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దుర్గగుడి ఛైర్మన్‌ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు.

కరోనా కారణంగా గతేడాది భక్తుల రాక తగ్గగా.. టీకా కార్యక్రమం ముమ్మరంగా సాగుతుండడంతో పాటు కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇదీ చదవండి:Tirumala: శ్రీవారి సేవలో ప్రముఖులు

ABOUT THE AUTHOR

...view details