విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. 9వ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజుతో దసరా ఉత్సవాలు పూర్ణాహుతితో పరిసమాప్తం అయ్యాయి. సాయంత్రం కృష్ణానది ఒడ్డున ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నదిలో నీటి ఉద్ధృతి కారణంగా ఉత్సవమూర్తుల జలవిహారం రద్దు చేశారు.
VIJAYAWADA: ఇంద్రకీలాద్రిపై ఘనంగా ముగిసిన శరన్నవరాత్రులు.. - dasara in durga temple
ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆఖరి రోజైన ఇవాళ. దుర్గమ్మ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ్టితో.. ఉత్సవాలు పూర్ణాహుతితో పరిసమాప్తం అయ్యాయి. సాయంత్రం కృష్ణానది ఒడ్డున.. ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
vijayawad
దసరా చివరిరోజు ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఉదయం నుంచి క్యూలైన్లలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. క్యూలైన్లు ఆలస్యం కావడంతో పోలీసులతో భక్తులు వాగ్వాదానికి దిగుతున్నారు. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందంటూ భక్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: Dussehra Festival: ఆయుధధారిణి.. శక్తి స్వరూపిణి.. జగన్మాత
Last Updated : Oct 15, 2021, 12:19 PM IST