ఆదివారం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా విజయవాడలోనే నమోదయ్యాయి. దీనిపై పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు రంగంలోకి దిగారు. సీపీ ఆదేశాల మేరకు డీసీపీ విక్రాంత పాటిల్, ఏసీపీ నక్క సూర్యచంద్రరావు ప్రత్యేక బృందాలతో రోడ్డుపైకి వచ్చి లాక్డౌన్ తీరును పరిశీలించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని అంబులెన్స్ ఎక్కించి క్వారంటైన్‌కు పంపుతున్నారు. ఫలితంగా కృష్ణలంక ప్రాంతంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.
అనవసరంగా బయటకు వస్తే.. ఇక క్వారంటైన్కే..! - విజయవాడలో కరోనా కేసులు
లాఠీతో కొడితే చెడ్డ పేరు... వాహనాలు సీజ్ చేస్తే.. నడుచుకొని తిరుగుతున్నారు.. వదిలేద్దాం అంటే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు విజయవాడలోని కృష్ణలంక పోలీసులు కొత్త చర్యలు ప్రారంభించారు.
vijayawada cp tirumala rao new rule